తన కెరీర్ లో తొలిసారి ఓ పాన్ ఇండియా మూవీ చేశాడు సందీప్ కిషన్. ఆ మూవీకి ఇప్పుడు విడుదల తేదీ ఫిక్స్ అయింది. సందీప్ జాతకాన్ని డిసైడ్ చేయబోతోంది.
ఈ చిత్రం పేరు ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పోస్టర్లు, టీజర్, ‘నువ్వుంటే చాలు’ ఫస్ట్ సింగిల్ చాలా క్యూరీయాసిటీని పెంచాయి. సామ్ సి ఎస్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ తన సోల్ ఫుల్ సింగింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ఈ పాట మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
మైఖేల్ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అనౌన్స్మెంట్ పోస్టర్ లో ప్రధాన నటీనటులందరినీ రా, రస్టిక్ లుక్స్ లో ప్రజంట్ చేశారు. సందీప్ కిషన్ ముఖంపై గాయాలతో కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి సిగరెట్ వెలిగిస్తూ కనిపించాడు. గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్ లు కూడా పోస్టర్ లో కనిపించారు. ఇది చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావులు నిర్మించారు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.