భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. సీఏఏ చట్టంపై మైక్రోసాప్ట్ సీఈవో సత్యనాదేళ్ల స్పందించారు. సీఏఏ బాధ, విషాదం కలిగిస్తోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఓ దేశానికి వలసదారులతో మంచి జరిగే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
బజ్‌ఫీడ్ ఎడిటర్ బెన్ స్మిత్‌తో ఇంటర్వ్యూలో సత్యనాదేళ్ల ఈ కామెంట్స్ చేశాడు. సీఏఏ తర్వాత దేశంలో జరుగుతున్న పరిణామాలు మంచిది కాదని, ఆందోళన కరంగా ఉన్నాయని అభిప్రాయపడుతూ… బంగ్లాదేశ్ నుండి భారత్‌కు వచ్చి తదుపరి ఇన్ఫోసిస్ కంపెనీ సీఈవో కావాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Advertisements
అయితే, ప్రతి దేశం తన సరిహద్దులు కాపాడుకుంటూనే… సరైన ఇమ్మిగ్రేషన్ పాలసీని తీసుకరావాలని, అప్పుడు విభిన్న సంస్కృతులు కలిగిన భారత్ నుండి వచ్చి అమెరికాలో నేను పెరిగాను అంటూ కామెంట్ చేశారు సత్య నాదేళ్ల.