కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిరసన తెగ తగిలింది. మిడ్ మానేరు సందర్శనకు వెళ్లిన ముఖ్యమంత్రి కాన్వాయ్ ను బాధిత రైతులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆ ప్రాంతమంతా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కడుపు మండిన రైతులు పోలీసులను ఏ మాత్రం లెక్కచేయకుండా సరిగ్గా సీఎం వచ్చే సమయానికి కాన్వాయ్ కు అడ్డుగా వెళ్లారు. దీంతో కాన్వాయ్ లోని వాహనాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. పోలీసులు ఆ రైతులను పక్కకు ఈడ్చుకు వెళ్లారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న రైతులు