వరంగల్ జిల్లా గీసుకొండలోని గొర్రెకుంట బావిలో తాజాగా మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. నిన్న నాలుగు మృతదేహలను పోలీసులు వెలికితీయటంతో మొత్తం 7కు చేరాయి. మృతులంతా బెంగాల్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
గన్నీ బ్యాగుల పరిశ్రమలో పనిచేసే మక్సూద్ తో పాటు ఆయన కుటుంబంలో ఆరుగురు ఉంటారు. మక్సూద్ మనువడి పుట్టిన రోజు ఇటీవల జరగ్గా ఆ రోజు పక్కనే నివాసం ఉండే తోటి వలస కూలీలతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మక్సూద్ కూతురు తన భర్తతో గొడవపడి తండ్రి వద్దే ఉంటుంది. ఆమె విషయంలోనే గొడవ జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అయితే… ఇవి ఆత్మహత్యలు కావని, విష ప్రయోగం ఏమైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వరంగల్ కమిషనర్ ఇప్పటికే సంఘటన స్థలాన్ని పరిశీలించగా, ఒక అనుమానితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.