లాక్ డౌన్ సమయంలో రానా మిహికల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఇద్దరు హానిమూన్ కి కూడా వెళ్లారు. అయితే హనీమూన్ సమయంలో ఒక్క ఫోటో మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ జంట. మామూలుగా ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. కొత్త ఫోటోలను పోస్ట్ చేయడమే కాకుండా సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు.
తాజాగా తన భర్త ని పొగుడుతూ ఇంస్టాగ్రామ్ లో మిహిక బజాజ్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం రానా ఓ యూట్యూబ్ ఛానెల్ స్థాపించి.. వైఆర్‌యు అనే షోని నడిపించబోతున్నట్లుగా తెలిపారు. అందులో భాగంగా ఎందరో సెలబ్రిటీలను ఆయన ఈ షోకి తీసుకురానున్నారు. కాగా ది అండర్ అండర్‌టేకర్ రెజ్లర్‌తో ఛాట్ అద్భుతంగా ఉందంటూ తెలుపుతూ ఓ ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటోని షేర్ చేసిన మిహీకా.. నా భర్త కూలెస్ట్ అంటూ పోస్ట్ చేసింది.