సింగర్ మికా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ముంబైలో అండర్ వరల్డ్ ఉండేదని మనం వినేవాళ్లమని, ఇప్పుడు పంజాబ్ లోనూ అండర్ వరల్డ్ స్టార్ట్ అయిందన్నారు. ఈ పరిస్థితులు తప్పుడు సందేశాన్ని పంపిస్తాయన్నారు.
ఈ విషాద ఘటనతో ఇండస్ట్రీలో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారని తెలిపారు. అయితే బెదిరింపులు వస్తున్నది సిద్ధూకే కాదనీ, గిప్పీ గరేవాల్, మన్‌కీర్ట్ ఔలాఖ్‌తో సహా చాలా మంది పంజాబీ సింగర్‌లకు కూడా వచ్చాయని పేర్కొన్నారు.
‘ ఈ ఘటన ప్రతి ఒక్కరికీ మేల్కొలుపు అవుతుంది. గ్యాంగ్ స్టర్స్ మన దగ్గర నుంచి డబ్బలను డిమాండ్ చేస్తారు. వారు కోరినట్టు పైసలు ఇస్తే సరీ.. లేదంటే వారికి కూడా ఇలాంటి ఘటన ఎదురవ్వవచ్చు’అని పేర్కొన్నారు.
‘ ఇటీవల పంజాబ్ లో పలువురు సింగర్లకు ఇలాంటి హెచ్చరికలే వస్తున్నాయి. దీంతో చాలా మంది పరేషాన్ గా ఉన్నారు. ఇలా అయితే రాబోయే రోజుల్లో సెలబ్రిటీలు షూటింగ్ కోసం రాష్ట్రానికి రావడం మానేస్తారు’ అని అన్నారు.