తమిళనాడు కూనూర్ లో ఓ శిక్షణ హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు, సిబ్బంది ఉన్నారు. మొత్తం 14 మంది అందులో ఉన్నట్లు తెలుస్తోంది.
సూలూర్ వైమానిక స్థావరం నుంచి వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి వెళ్తుండగా హెలికాప్టర్ కుప్పకూలింది. నీలగిరి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో శిథిలాలను గుర్తించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆర్మీ అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 80 శాతానికిపైగా కాలిన గాయాలతో ఇద్దరిని హాస్పిటల్ కు తరలించారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
హెలికాప్టర్ ప్రమాదంపై స్పందించిన వాయుసేన.. ట్విట్టర్ వేదిక ఓ ప్రకటన చేసింది. ప్రమాదానికి గురైన Mi-17V5 హెలికాప్టర్ లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నట్లు తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది.