రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాల సైన్యం, ఆయుధ సంపత్తిపై చర్చ జరుగుతోంది. యూరప్‌లో అతి పెద్ద దేశమైన రష్యా.. క్షిపణి సాంకేతికత విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. జనాభాపరంగానూ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది.
రక్షణ వ్యవస్థ కోసం రష్యా 61.7 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. ప్రపంచంలో రెండు అతిపెద్ద సైన్యం ఉన్న దేశంగా కూడా రికార్డ్ ఉంది. సాధారణంగా యుద్ధమంటే ఇద్దరు సమ ఉజ్జీల మధ్యనో లేదా కాస్త అటు ఇటు బలం ఉన్న వారి మధ్యనో జరుగుతుంది. కానీ.. ఈ దేశాల బలాబలాలను పరిశీలిస్తే.. ఉక్రెయిన్ లెక్కలోకే రాదు. కానీ.. రష్యాకు దీటుగా సమాధానం ఇస్తోంది.
ఉక్రెయిన్ యూరప్‌లో రెండో పెద్ద దేశంగా ఉంది. జనాభాపరంగా చూస్తే ఏడో స్థానంలో ఉంది. ప్రపంచంలో సైనికబలంలో 22వ స్థానంలో ఉండగా.. మిలటరీ కోసం 5.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది.