బాలీవుడ్ లో హిమ్మత్‌వాలా సినిమాతో జెండా పాతాలని ఆశపడింది మిల్కీ బ్యూటీ తమన్నా. హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్ ను ఆరంభించిన తమన్నా టాలీవుడ్ కోలీవుడ్ లో టాప్ హీరోల అందరి సరసన నటించింది. అయితే బాలీవుడ్ లో కూడా అదే తరహాలో నిలబడాలని చూసింది. కానీ ఆ సినిమా ఘోర పరాజయం చవిచూడటంలో బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు.
తాజాగా ఆ సినిమా గురించి తమన్నా మాట్లాడింది. హిమ్మత్‌వాలా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. కెరీర్ పరంగా ఆ సినిమా నాకు గట్టి ఎదురుదెబ్బ. ఆ సినిమా పరాజయం పాలైంది. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉండడం వల్ల హిమ్మత్‌వాలా పై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోయాను. అయితే ఆ సమయంలో ఆ పరాజయం గురించి ఎక్కువ ఆలోచించడం కుదరలేదు. అప్పటికి నేను పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉండేదాన్ని. సినిమా ఫలితం గురించి ఆలోచించే సమయం ఉండేది కాదంటూ చెప్పుకొచ్చింది.