మంచి పెట్టుబడి కోసం చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే… పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కోటీశ్వరులను చేస్తుంది. ఈ స్కీం తక్కువ రిస్క్ తో ఉండడమే కాకుండా మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల ఏ మాత్రం ప్రభావితం కాదు. పైగా వడ్డీరేట్లను ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన ఇస్తూ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ప్రస్తుతం పీపీఎఫ్ పథకంపై 7.1 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ బ్రాంచ్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ను ఓపెన్ చేయొచ్చు. కేవలం 500 రూపాయలతో ఈ ఖాతా ఓపెన్ చేయొచ్చు.
ఇందులో ఏడాదికి లక్ష 50 వేల వరకు డిపాజిట్ చేయచ్చు. ఈ కథా మెచ్యూరిటీ 15 ఏళ్లు. ఆ తర్వాత కావాలనుకుంటే మరింత పొడిగించవచ్చు.ప్రతి నెల పీఎఫ్ ఖాతాలో రూ. 12,500 మెయింటెన్ చేస్తే మెచ్యూరిటీ పూర్తయ్యాక చేతికి మొత్తం రూ.40.68 లక్షలు వస్తాయి. 15 సంవత్సరాలలో సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ రేటు ప్రకారం మీ మొత్తం పెట్టుబడి 22.50 లక్షలు కాగా, వడ్డీ ద్వారా రూ.18.18 లక్షలు పొందొచ్చు.
ఈ పథకం ద్వారా కోటీశ్వరులు కావాలంటే 15 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత రెండుసార్లు తొలగించాల్సి ఉంటుంది. అంటే 25 ఏళ్లు ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొత్తం రూ.1.03 కోట్లు అవుతుంది. ఇందులో పెట్టుబడి 37.50 లక్షలు కాగా, వడ్డీ ఆదాయంగా రూ.65.58 లక్షలు చేతికి వస్తుంది. ఆ తర్వాత పిపిఎఫ్ ఖాతా ను మరింతగా పొడిగించాలని అనుకుంటే ఒక సంవత్సరం ముందుగానే దరఖాస్తు చేయించుకోవాల్సి ఉంటుంది.