దేశంలో ప్రతి ఒక్క ముస్లిం ఇళ్ళు పై జాతీయ జెండా ఎగరాలన్నారు అసదుద్దీన్. దేశంలోని ప్రజల మధ్యలో గాంధీ లేడు… కానీ గాంధీ జ్ఞాపకాలు ఉన్నాయి.అంబేడ్కర్ లేడు కానీ ఆయన రాజ్యాంగం మనలో ఉందన్నారు. దేశంలో ఉన్న ప్రతి ఇంటి పై జాతీయ జెండాను మోడీ, అమిత్ షా చూడాలని ముస్లిమ్ లకు అసదుద్దీన్ పిలుపునిచ్చారు. ఇప్పుడు హిందూ ముస్లిమ్..బీజేపీ ఎంఐఎం మధ్య గొడవ కాదు. దేశానికి ప్రజలకు మధ్య గొడవ. దేశాన్ని రక్షించాల్సిన భాద్యత ప్రజలందరి పైన ఉందన్నారు.
అమిత్ షా చరిత్ర ఎలాంటి తో అందరికి తెలుసు..బీజేపీ ఆరెస్సెస్ ముస్లిమ్ లను మాత్రమే అవమానించినట్టు కాదు, గాంధీ, అంబేడ్కర్, అబ్దుల్ కలాం ని అవమానించినట్లే. ఇది నా దేశం..దేశం కోసం నా ప్రాణాలు అయినా ఇస్తాను. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్గానిస్తాన్ తో నాకేమి సంబంధం.అస్సాంలో ఎంతో మంది పై బులెట్స్ కురిపిస్తున్నారు గన్స్ లో బులెట్స్ ఖాళీ అవుతాయి కానీ మేము పోరాటం ఆపమని హెచ్చరించారు అసదుద్దీన్.