తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కి వయసు మీద పడుతున్నా ఇమేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదనే చెప్పాలి. ఆయన స్టార్ దర్శకులతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా సరే ఆరేళ్ళ నుంచి ఆయన ఇమేజ్ ఎక్కడా డ్యామేజ్ కాలేదు. కాస్త ఇబ్బంది పడినట్టు కనపడినా ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచేసి సినిమాలను చేస్తున్నారు రజనీ కాంత్.
ఇప్పుడు ఆయన రెండు సినిమాలకు సంతకం చేసారు. త్వరలో మరో సినిమాకు కూడా రజనీ సంతకం చేసే అవకాశం ఉంది. ఇందులో జైలర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విషయంలో రజనీ గతంలో ఎన్నడూ లేని విధంగా సమయం తీసుకుంటున్నారు. ఇక రజనీ కాంత్ పాత్ర కూడా భాషా రేంజ్ లో ఉంటుందని దర్శకుడు అలా డిజైన్ చేసాడు అని తమిళ సిని వర్గాలు అంటున్నాయి.
జైలర్ సినిమా కోసం గానూ ఆయన ఏకంగా 140 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. ఇక మరో సినిమా లాల్ సలాం. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. లాల్ సలాం సినిమాలో రజనీ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఇందుకోసం ఆయనను ఏడు రోజుల డేట్స్ అడిగారు. అందుకోసం ఏకంగా రజనీ 25 కోట్లు అడిగినా నిర్మాణ సంస్థ ఓకే అంది. 25 కోట్ల రెమ్యునరేషన్ అంటే… రోజుకు రు 3.5 కోట్ల వరకు తీసుకుంటున్నారు రజనీ.