గడ్డలకొండ గణేష్ సినిమాతో రెండు సంవత్సరాల కింద ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తరువాత గని సినిమా స్టార్ట్ చేశాడు వరుణ్.
బాక్ససింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.కానీ వివిధ కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు ఫిబ్రవరి 25న విడుదల చేయాలనుకున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కూడా 25న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకోవడంతో గని దర్శక నిర్మాతలు కాస్త అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చి 4న సినిమాను భారీగా విడుదల చేయాలని చూస్తున్నారట. మరి చూడాలి ఏం జరుగుతుందో.
తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా అల్లు బాబీ, సిద్దు ముద్ద లు సంయుక్తంగా నిర్మించారు.