కర్నూలు జిల్లాలో ఓ మినీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. మంత్రాలయం సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 8 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు బోల్తా పడినా.. వారికి స్వల్ప గాయాలే అయ్యాయి.
మినీ బస్సు బెంగళూరు నుంచి మంత్రాలయం వస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని అనుకుంటున్నారు. పొలాల్లో ఉన్న బస్సును స్థానికులు, పోలీసులు జేసీబీ సాయంతో తొలగించారు.