తెలంగాణ అసెంబ్లీలోని శాసన మండలిలో మంత్రి తలసాని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిల మధ్య ఒక మినీ యుద్ధమే చోటు చేసుకుంది. బీసీ వెల్ఫేర్ ప్రశ్నపై సభ్యులు, మంత్రి మాట్లాడుతున్న సమయంలో.. మంత్రి తలసాని మధ్యలో కల్పించుకొని మాట్లాడారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ మీద ప్రశ్నలు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
గతంలో పాలకు ఎవ్వరై ఇన్సెంటివ్ ఇవ్వలేదని, తమ ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందన్నారు. ఇందుకు జీవన్ రెడ్డి బదులిస్తూ.. నువ్వు ముందు నీ శాఖకు సంబంధించిన పనులు చూసుకో అని, తర్వాత వేరే శాఖ మీద మాట్లాడు అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తాను అల్రెడీ ఎస్పీ వెల్ఫేర్ గురించి మాట్లాడానని, అప్పుడు నువ్వు నిద్రపోయినట్టున్నావని ఎద్దేవా చేశారు.
నీ శాఖలో పాలకు ఇన్సెంటివ్ 4 రూ. ఇస్తానని చెప్పి నాలుగేళ్ల అవుతుందని, అది ఎప్పుడు ఇస్తారో చెప్పు అని నిలదీశారు. ఇంతలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుకొని.. ఒక లీటర్ పాలకు ఒక రూపాయి ఇన్సెంటివ్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరితే 4 రూ. ఇచ్చిన ఘనత ఆయనకే దుక్కుతుందన్నారు.
అంతకు ముందు బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. వసతుల కల్పన చేయకపొవడంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెవవేరడం లేదని.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ బదులిస్తూ..గురుకులాలకు అద్దె భవనాలు సమస్య కాదని , విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందా లేదా అనేది మాత్రమే చూడాలన్నారు.