జనసేన నేత, సినీ నటుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. భోగి వేడుకల్లో అంబటి రాంబాబు డ్యాన్స్ వీడియోపై స్పందించిన నాగబాబు.. డ్యాన్స్ బాగా చేశారని, పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఇంకా బాగుండేదని సెటైర్లు వేశారు. అయితే ఇందుకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. నాగబాబు, ఆయన తమ్ముడు అన్నట్టు తాను సంబరాల రాంబాబునే అని అన్నారు.
కానీ ముఖానికి రంగు వేయనని.. ప్యాకేజి కోసం డాన్స్ చేయనని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు చేసిన అంబటి రాంబాబు.. నాగబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అకౌంట్స్‌ను ట్యాగ్ చేశారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో శనివారం భోగి మంటలు వేసి సంబరాలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకే పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో భోగి మంటలు వేశారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు.
అయితే దీనిపై స్పందించిన నాగబాబు.. ‘‘సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు… పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది !’’ అని ట్వీట్ చేశారు.
నువ్వు, మీతమ్ముడు అన్నట్టు
"సంబరాల రాంబాబు"నే !
కానీ…ముఖానికి రంగు వేయను
ప్యాకేజి కోసం డాన్స్ చేయను ! @NagaBabuOffl@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 16, 2023