ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలంగాణకి నష్టం జరిగే ఏ పనులు చేయరన్నారు మంత్రి అనిల్ కుమార్. కృష్ణ నీటి వాడుకలో రెండు రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.
రాజకీయ ప్రయోజనాల కోసమే కొన్ని పార్టీలు కృష్ణా నీటిని వివాదం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.
ఏపీ, తెలంగాణ ల సీఎం లు అన్నదమ్ముల లాగా కలిసి ఎవరికి ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి రైతులను రెచ్చగొట్టాలని అని చూస్తే చూస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు.