చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలన్నారు మంత్రి అనిల్ కుమార్. ప్రతి విషయానికి కులాలు, మతాలు ప్రస్తావన అవసరం లేదని విచారణ లో నిజానిజాలు తేలుతాయన్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో రాష్ట్రాన్ని వాడుకోవడం సరికాదని విమర్శించారు. అవినీతి పై విచారణ అంటేనే బీసీ కులాలు గుర్తుకు రావడం సిగ్గు చేటని విమర్శించారు.
నంద్యాల ఎన్నికల్లో ఉన్న నాకు బెట్టింగ్ నోటీసు ఇచ్చినప్పుడు నేను బీసీనని మర్చిపోయావా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోజు అధికారం ఉంది కదా అని ఒక బీసీ వర్గంకి చెందిన నా పై కావాలని కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఆఖరికి నా మీద కనీసం ఓ చిన్న పిట్టి కేసైనా పెట్ట గలిగారా అంటూ ప్రశ్నించారు. ఆ రోజు గుర్తురాలేద మీకు కులలు మతాలు, నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరూ ఊరుకోరని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు.