చిన్ననాటి నుంచి చిరంజీవి అంటే ఇష్టం…ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా మెగా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం అన్నారు మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్. చిన్న నాటి నుంచే పవన్ మీద అభిమానం ఉన్నప్పటికీ రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని సార్లు విమర్శించక తప్పలేదంటూ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. సినిమాల్లో చిరంజీవి నా అన్న అని చెప్పుకునే పవన్, రాజకీయాల్లో నేను ఒక కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకోవడం విడ్డురంగా ఉందన్నారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని అనటమే కానీ అధికార పార్టీని ఒక్కమాట కూడా అనలేదు. పవన్ కళ్యాణ్ నిజమైన రాజకీయ నేత కాదన్నారు అనిల్ కుమార్. మొదటగా పవన్ లో కష్టపడే తత్త్వం లేదన్నారు. పవన్ తో పొత్తు మాకు అవసరం లేదని మా బలం మాకు ఉందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు పెద్ద అవకాశవాదని, చిన్న అవకాశం వచ్చిన రాజకీయాలకోసం వాడుకుంటాడని విమర్చించాడు. ఇక చంద్రబాబు కొడుకు నారా లోకేష్ రాజకీయాలకు పనికిరాడని అయన ఎంత దూరంగా ఉంటె టీడీపీకి అంత మంచిదని అభిప్రాయపడ్డాడు మంత్రి.