రాష్ట్ర విభజన కంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు మంత్రి బొత్స. రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణంపై చర్చ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. గంటకో మాట మారుస్తున్నారని మండిపడ్డారు. సింగపూర్ ప్రతినిధులు తమతో కూడా సమావేశమయ్యారని, రాజధాని నిర్మిస్తామంటే తమకు అభ్యంతరం లేదని వారికి చెప్పామన్నారు. కానీ, సంపద ఎలా సృష్టిస్తారో అడిగితే.. ప్రజెంటేష్ ఇవ్వకుండా వెళ్లిపోయారని బొత్స తెలిపారు.