రాజధానిపై స్పష్టత కోసం కమిటీ వేశామని కమిటీ రిపోర్ట్ తర్వాత పూర్తి స్పష్టత వస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతిలో నిర్మాణ దశలో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని బొత్స తెలిపారు. టీడీపీ నేతలు అసెంబ్లీలో దుర్భాషలాడుతూ సభను సజావుగా జరగనివ్వడం లేదన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని ఆరోపించారు బొత్స. విశాఖ మెట్రోను రెండు ఫేజ్‌లుగా చేయాలని నిర్ణయించామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుపై మళ్లీ టెండర్‌కు వెళ్లే విషయంపై ఆలోచన చేస్తున్నామని తెలిపారు బొత్స.