సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంతరం కరోనా వైరస్ పై సమీక్షస్తున్నారని, వైరస్ నియంత్రణ కు అనేక ఉన్నత స్థాయి కమిటీ లు కూడా వేశారని తెలిపారు మంత్రి బొత్స సత్యన్నారాయణ. మీడియా తో మాట్లాడిన బొత్స ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు.
ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వల్ల ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చాయని నివేదికలు వస్తున్నాయి. వాళ్ళు స్థానిక అధికారులకు సహకరించి స్వచ్చందంగా పరీక్షలు చేయించుకోవాలని వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సర్వే కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తరుపున
సరిహద్దుల్లో ఉన్నవారికోసం భోజన వసతి ఏర్పాట్లు చేశామన్నారు. 950 రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లు ను కూడా ఏర్పాటు చేశామన్నారు. 2000 క్వరెంటైన్ బెడ్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నియోజకవర్గల్లో కూడా అన్ని ఏర్పాట్లు చేశాము.ధరలు పడిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. పట్టణల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నాము. ఆరోగ్య శాఖకు నిధులు కొరత లేకుండా చేస్తున్నామని తెలిపారు. పింఛన్లు వాలంటిర్లు ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు.
విమర్శలు చేసుకొనే సమయం ఇది కాదని రాజకీయాలను పక్కన పెట్టాలని కోరారు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు విమర్శలు దురదృష్టకరం. మేము పబ్లిసిటీలో వెనుకబడి ఉన్నాము. జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ అవసరం లేదు. ఉన్నవి లేనట్లు చూపి చంద్రబాబు అధోగతి పాలయ్యారు. సంక్షోభ సమయంలో ప్రజలకు మేలు జరిగితే చాలని బొత్స అన్నారు. చిన్న చిన్న సంఘటనలను చంద్రబాబు భూతద్దంలో చూపిస్తున్నారు..చంద్రబాబు చౌకబారు విమర్శలు మానుకోవాలి. ఫొటోలతో చంద్రబాబులా హడావిడి చేయడం మాకు అలవాటు లేదు.కరోనా టెస్టులు చేయక పోతే పాజిటివ్ కేసులు ఎలా బైట పడతాయి.మా పై ఆరోపణలు చేసిన వారికి కూడా కరోనా టెస్టులు చేయిస్తాము.