ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారా స్థాయికి చేరింది. నిమ్మగడ్డ ఇటు మంత్రులను కూడా కేసులు తప్పవంటూ టార్గెట్ చేయటంతో… మంత్రులు నిమ్మగడ్డపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నుండి నోటీసులు పంపబోతున్నారు.
నిమ్మగడ్డ గవర్నర్ కు లేఖ రాస్తూ… మంత్రులు బొత్స, పెద్దిరెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల తమ పరిధి దాటి మాట్లాడుతున్నారని, వారిపై చట్టపరంగా ముందుకెళ్తానంటూ పేర్కొన్నారు. దీంతో మంత్రులు అసెంబ్లీ స్పీకర్ ను ఫిర్యాదు చేశారు. తమను అగౌరవపరుస్తున్నారని ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. తమను పనిచేయనివ్వకుండా అడ్డుతగులుతున్నారంటున్నారు.
దీంతో ఇప్పుడు స్పీకర్ తమ్మినేని ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. కానీ స్పీకర్ ఎలాగూ ఇప్పటికే నిమ్మగడ్డకు వ్యతిరేఖంగా మాట్లాడిన సందర్భాలున్నందున… ఖచ్చితంగా నిమ్మగడ్డకు మింగుడు పడని రియాక్షనే ఉంటుందని, అయితే తను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉండి ఉంటాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.