మహానాడు జూమ్ యాప్ మమ్మల్ని తీసుకోండి...బొత్స - Tolivelugu

మహానాడు జూమ్ యాప్ మమ్మల్ని తీసుకోండి…బొత్స

2019 మే 23 తేదీ సువర్ణ అక్షరాలు తో లిఖిచదగ్గ తేదీ అన్నారు మంత్రి బొత్స సత్యన్నారాయణ. రాజశేఖర్ రెడ్డికి మించిన తనయుడిగా జగన్ మోహన్ రెడ్డి ని ప్రజలు ఎన్నుకున్నారన్నారు.

రెండు పేజీల్లో మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి పెట్టారు. ఏడాది కాలంలో దాదాపు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలు సీఎం జగన్ అమలు చేశారని.. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారని చెప్పుకొచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే హామీలు సాధ్యం కాదని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అనే విధంగా సీఎం జగన్ హామీలు అమలు చేస్తున్నారని ప్రజల కష్టాలు తీర్చడం కోసం నవరత్నాలు మేనిఫెస్టోలో పెట్టారని తెలిపారు. న్యాయ స్థానాలకు వెళ్లి టీడీపీ ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుందని ఆరోపించారు.
టీడీపీ వైఖరిని ప్రజలు గమనించాలని కుట్రలు కుతంత్రాలు తో టీడీపీ కోర్టు లకు వెళ్తుందని ఆరోపించారు.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలం, పక్క ఇల్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యమన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడుతారన్నారు.ప్రభుత్వం ఎక్కడ వైపల్యం చెందిడిందో చంద్రబాబు చెప్పాలి. మహానాడులో ప్రభుత్వం వైఫల్యాలను చర్చ చేసే సమయంలో మమ్మల్ని కూడా జూమ్ లోకి తీసుకోవాలి. చంద్రబాబుతో బహిరంగంగా జూమ్ యాప్ లో చర్చ చేసేందుకు మేము సిద్ధమన్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp