అవినీతి సంపాదన కోసమే చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం అంటూ హడావిడి చేశాడన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్. చంద్రబాబు అవినీతి డొంక ఇప్పుడిప్పుడే కదులుతుందని, బాబు అవినీతి ఫలితంగానే అతని పిఏ ఇంట్లో రెండు వేల కోట్ల అవినీతి బయటపడిందని ఆరోపించారు. కర్నూల్ జిల్లాలో అక్రమాలు చేస్తాం, సన్మానం చేయండి అన్నన్నట్టు కేయి కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. నకిలీ మద్యం కేసులో వాస్తవాల ఆధారంగానే పోలీసులు వ్యవహరించారు.
డోన్ టీడీపి ఇన్చార్జ్ కేయి ప్రతాప్ ఇంట్లో 23 క్యాన్ల నకిలీ మద్యం దొరికింది వాస్తవమే కదా అని ప్రశ్నించారు. అవినీతిపరులు, అక్రమార్కులు పట్టుబడక తప్పదని పోలీసు అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది అనటం అవాస్తవమని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ విజిటింగ్ ప్రొఫెసర్ గా మారాడు. గట్టిగ చెప్పాలంటే పవన్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు బుగ్గన.