శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో నిర్వహించిన జాబ్ మేళాలో మినిస్టర్ ధర్మాన కృష్ణదాస్ నోరుజారారు. చప్పట్లు కొట్టట్లేదంటూ నిరుద్యోగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగులను ఉద్దేశించి కృష్ణదాస్ మాట్లాడుతున్న సమయంలో నిరుద్యోగులంతా సైలెంట్ గా ఆయన చెప్తుంది వింటున్నారు. మరి కృష్ణదాస్ గారికి ఏమైందో తెలీదు కానీ ఒక్కసారిగా ఆవేశంతో నోరు జారేశారు. మూగజీవికి పచ్చగడ్డి వేస్తే కృతజ్ఞతగా ఉంటుంది, కుక్కకు బిస్కెట్ వేస్తే కృతజ్ఞతగా ఉంటుంది…ఇంతమందికి మంచి చేసిన సీఎంకు కృతజ్ఞతగా కనీసం చప్పట్లు కూడా కొట్టకపోవడం దారుణమంటూ మంత్రి నిరుద్యోగులపై వ్యాఖ్యలు చేశారు.
నిరుద్యోగ్యులపై కృష్ణదాస్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కృష్ణదాస్ వ్యాఖ్యలపై అటు ప్రతిపక్షాలతో పాటు, సామాన్యప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.