రాజకీయం వేరు బంధుత్వం వేరు - అచ్చెన్నాయుడికి మంత్రి వార్నింగ్ - Tolivelugu

రాజకీయం వేరు బంధుత్వం వేరు – అచ్చెన్నాయుడికి మంత్రి వార్నింగ్

మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసలు బండారం త్వరలో బయటపడుతుందన్నారు మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఈఎస్ఐ కుంభకోణంలో తనకు సంబంధం లేదని అచ్చెన్నాయుడు అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు మంత్రి ధర్మాన. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం వైఎస్ఆర్సీపీ కార్యాలయంను ప్రారంభించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేయకూడదని, నీతి,నిజాయితీతో కూడిన రాజకీయాలు అలవాటు చేసుకోవాలన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు అడ్డగోలుగా దోపిడీ చేశారని, తప్పు జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి తప్ప నిజాయితీ అని మాట్లాడడం హాస్యాస్పదమని తెలిపారు. రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరని ఈ సందర్భంగా తెలిపారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp