తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా కష్టకాలంలో జనాన్ని కడుపుబ్బా నవ్విస్తున్నారు. అసలు దయాకర్ రావు మాటలకు జనం ఎందుకు నవ్వుతున్నారంటే,
చైనా దివాలా తీయడంతో, అక్కడున్న కంపెనీలన్నీ ఇండియా కు రావాలని నిర్ణయించుకున్నాయట, వెంటనే మోదీ కి చెప్పారట. ఇండియా లో ఎక్కడకు వెళ్తారు అని మోదీ అడగ్గానే, హైదరాబాద్ కు మా కంపెనీలు తరలిస్తామని చెప్పారట. అంతేకాదు వరంగల్ కు కూడా పరిశ్రమలను చైనా నుండి తరలిస్తున్నామని చెప్పారట.
మంత్రి మాటలు విన్న జనం మంత్రి గారి ముందు చప్పట్లు కొట్టి, పక్కకొచ్చి నవ్వుకున్నరట.అక్కడితో ఆగుతుందా సోషల్ మీడియాలో మంత్రి మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.కరోనా కష్ట కాలంలో కడుపుబ్బా నవ్వించారు మంత్రి గారు అని సెటైర్ లు వేస్తున్నారు జనం.