సీఎం కేసీఆర్ వల్లే జనగామ జిల్లాలో నీటి సమస్య తీరిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దేవాదుల ద్వారా జిల్లాలో ప్రతి చెరువు నింపగలిగామన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత జనగామ జిల్లా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కేసీఆర్ కృషి వల్లే దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
కేంద్రం తన హామీలు అమలు చేయడంలేన్నారు. అయినా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. పార్లమెంటులో కేంద్రమంత్రులే తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పరని పేర్కొన్నారు. కేసీఆర్ వెనక నిలబడి తెలంగాణను కాపాడుకోవాలని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కృషికి కృతజ్ఞతగా జనగామ జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ బహిరంగ సభకు లక్షకుపైగా ప్రజలు హాజరవనున్నట్టు ఆయన వెల్లడించారు. రెండు రోజుల పాటు సీఎం కేసీఆర్ జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నట్టు మంత్రి వెల్లడించారు.
పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన మరో రెండు కలెక్టరేట్ భవనాలను ప్రారంభించనున్నారు. శుక్రవారం రోజు జనగామ జిల్లాలోని నూతన కలెక్టరేట్ తో పాటు.. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.