ఎవర్ని అంటున్నారో నేరుగా చెప్పకపోయినా… సీఎం కేసీఆర్ కు సూటిగా తగిలేలా మంత్రి ఈటెల చేస్తున్న వ్యాఖ్యల జోరు మరింత పెంచారు. పాలనకు మెరిట్ కావాలని, మేము గులాబీ పార్టీ ఓనర్లమని, కొట్లాడేతత్వం కోల్పోలేదంటూ హాట్ కామెంట్స్ చేసిన ఆయన… మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మట్టికే పోరాడే తత్వం ఉందని… చైతన్యం చంపబడితే ఉన్మాదం వస్తుందన్న విషయాన్ని పాలకులు మర్చిపోరాదని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఉద్యమాన్ని ఆపే శక్తి జేజేమ్మకు కూడా లేదని సమైక్య పాలకులకు చెప్పామన్నారు. కులాలను బట్టి గౌరవించే పరిస్థితులు ఒక్క మనదేశంలోనే చూస్తున్నామన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా చట్టాలు రావాల్సిన అవసరం ఉందని, కేవలం ఓట్ల కోసం మాత్రమే పనులు చేయవద్దంటూ ఈటెల కామెంట్ చేయటం విశేషం.
ఇటీవల షాదీముబారక్, కళ్యాణలక్ష్మి వంటి కార్యక్రమాలతో పేదరికం పోదని.. ప్రజల జీవన పరిస్థితులు మెరగయ్యే చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు.