కరోనా వైరస్ వ్యాప్తి ఢిల్లీ కేంద్రంగా ఉందని కేంద్రాన్ని హెచ్చరించింది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఢిల్లీ ప్రార్థనలకు తెలంగాణ నుండి వెళ్లిన వారిని రెండ్రోజుల్లో ట్రేస్ చేశామని, అయితే మరో 160మంది ఆచూకి తెలియాల్సి ఉందని… వారంతా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో లోకల్ ట్రాన్సిమిషన్ జరగటం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ఈ రోజు ఇద్దరు కరోనా పేషెంట్లను డిశ్చార్జ్ చేస్తున్నామని… మరో 10 మందికి మరోసారి టెస్ట్ చేసి ఇంటికి పంపిస్తామని తెలిపారు. చాలా మంది కోలుకుంటున్నారని తెలిపారు మంత్రి ఈటెల.