తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉందని ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో కంటైన్మెంట్ జోన్ లు ఏర్పాటు చెయ్యాలని ముఖ్యమంత్రి ఉన్నారన్నారు మంత్రి ఈటెల. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పట్టించుకోవడంలేదని సోషల్ మీడియా లో దుష్పచారం బాధాకరమన్నారు. చెస్ట్ హాస్పిటల్ లో కి వచ్చిన పేషంట్ అనేక హాస్పిటల్స్ కి తిరిగిన తరువాత వచ్చారు. మిడ్ నైట్ వచ్చినా కూడా చేర్చుకుని రాత్రి అంతా ఆక్సిజన్ ఇచ్చాము. కానీ ఆయన గుండె జబ్బుతో చనిపోవడం బాధాకరం. ఆక్సిజన్ అందిచలేదు అనడం నిజం కాదు. 258 మందికి హెల్త్ వర్కర్స్ కి పాజిటివ్ వచ్చింది. చెస్ట్ హాస్పిటల్ లో హీడ్ నర్స్ విక్టోరియా చనిపోయింది. హెల్త్ సెక్రెటరీ ఆఫీస్ లో 11 మందికి కరోనా సోకింది, అందరికీ గాంధీ లో చికిత్స అందిస్తున్నాము.
ఒక్కరు చనిపోతే ప్రభుత్వ ఆసుపత్రి లో పని చేసే సిబ్బంది ఆత్మ స్థైర్యం దెబ్బతీయవద్దు.
సీఎం చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నిచలేరు. తెలంగాణ లో ప్రస్తుతం 17081 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 3500 ఆక్సిజన్ పైప్ లైన్ సిద్ధంగా ఉంది. మరో 6500 బెడ్స్ రెండు రోజుల్లో అందిస్తాం. మొత్తం 10 వేల బెడ్స్ ఆక్సిజన్ తో సిద్దం అవుతున్నాయి. రాష్ట్రం లో బెడ్స్ కి కొదువలేదు. అనవసరం గా ప్రైవేట్ కి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు.
ప్రైవేట్ లాబ్స్ లో కొన్నిటిలో 70-80 శాతం పాజిటివ్ కేసులు రావడం పై అనుమానాలు ఉన్నాయి. అధికారులు తనికీలు చేస్తున్నారు. రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఇచ్చామని అన్నారు ఈటెల.