అధికార పార్టీకి మున్సిపోల్స్ ముచ్చెమటలు పట్టించేలా ఉన్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ పనితీరు చేతల సంగతి దేవుడెరుగు కనీసం కాగితాలకు కూడా పరిమితం కాలేదు… అన్న విమర్శలు ఉన్నాయి. పైగా పట్టణాల్లో ప్రతిపక్ష పార్టీలకు మంచి పట్టే ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ మున్సిపోల్స్‌ను ఎలా హ్యండిల్ చేయాలి అన్న టెన్షన్‌లో ఉంది.
అయితే, కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్‌కు కరీంనగర్ కార్పోరేషన్ విజయం తప్పనసరి. కానీ అక్కడ బీజేపీ మంచి దూకుడు మీద ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చి రెండోస్థానానికి ఎగబాకి, లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా ఎంపీ స్థానాన్నే గెలవగలిగింది. అక్కడ మంత్రి గంగులకు, ఎంపీ బండి సంజయ్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోతుందా అన్నంత శత్రుత్వం ఉంది. దీంతో ఎలాగైనా కరీంనగర్ కార్పోరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసేందుకు హెచ్చరికలకు శ్రీకారం చుట్టారు మంత్రి గంగుల.
ఇలా అయితే మీ ఫోన్ హ్యక్ అయినట్లే !
కరీంనగర్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ బీజేపీని టార్గెట్ చేశారు. ఈసారి ప్రజలు బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వకూడదు. వారు గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుంది, ఒక్క బీజేపీ కార్పోరేటర్ గెలిచినా అక్కడ అభివృద్ధి ఆగిపోయటం ఖాయమని ప్రకటించారు. స్థానికంగా అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే ప్రజలు గెలిపించాలనీ, ఇతర పార్టీలను ఆదరించకూడదని గంగుల స్పష్టం చేశారు.
జనవరి నుండి మెట్రో పాస్‌లు కానీ…
ఒక రకంగా.. ఇది ప్రజలను హెచ్చరించటం లాంటిదే, స్థానికంగా ఎమ్మెల్యే పైగా మంత్రి అయిన గంగుల రాబోయే నాలుగు సంవత్సరాలు అభివృద్ది జరగదు… పలానా వారికి ఓటెయ్యొద్దు అని బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. తాము ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పాలి కానీ ఇలాంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మంచివి కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Advertisements
30 వేల మందికి గర్భాశయం లేదు..!