తొలివెలుగు పేరు వినబడితేనే తెలంగాణలో అధికార పార్టీ నేతలు హడలిపోతున్నారు. ప్రజల గొంతును, ప్రతిపక్షాల అభిప్రాయాలను నిర్భయంగా వినిపిస్తుండటంతో తలలు పట్టుకుంటున్నారు. తొలివెలుగులో ఓ కథనం వచ్చిదంటే.. అది నిజమే అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో కొందరు గులాబీ లీడర్లకు నిద్రపట్టడం లేదు. తాజాగా మంత్రి గంగులకు ఆ టెన్షన్ పట్టుకుంది.
గ్రాగ్రానైట్ బిజినెస్‌లో అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి గంగుల కుటుంబానికి చెందిన కంపెనీకి ఈడీ నోటీసులివ్వడం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో కరీంనగర్‌కు చెందిన బీజేపీ నేత బేతి మహేందర్ రెడ్డి.. తొలివెలుగుకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. మంత్రిగా ఉన్న గంగుల ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో.., ఎలాంటి అక్రమాలు చేస్తున్నారో ఆ ఇంటర్వ్యూలో వివరించారు. తొలివెలుగు ప్రసారం చేసిన ఆ కథనం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. విషయం మంత్రి గంగుల దృష్టికి రావడంతో.. ఆయన సహించలేకపోయారు. తనపై వచ్చిన అరోపణలపై మంత్రి ఎప్పుడెప్పుడు వివరణ ఇస్తారా అని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తోంటే.. ఆయన మాత్రం తనను విమర్శిస్తున్నవారిపై కేసులు పెట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు.
తొలివెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారని బేతి మహేందర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి మంత్రి చేసిన పని రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆరోపణలపై వివరణ ఇచ్చి హుందాగా వ్యవహరించాల్సిన మంత్రి.. కక్షగట్టి తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు పెట్టడం ఏమిటని అంతా విస్తుపోతున్నారు. తాను కేసు పెట్టడమేకాకుండా.. ఇతరులతో కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని చూసిన వారంతా.. ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడో లేక ఎవరో ఆరోపణలు చేసినప్పడో గంగుల పరువు పోలేదని.. ఇప్పుడు ఆయన ప్రవర్తిస్తున్న తీరే ఆయన పరువును గంగలో కలుపుతోందని అంటున్నారు. కేసులతోనే గంగుల పరువు నిలబడుతుందని అనుకంటే.. రాసలీలల వ్యవహారంపై కూడా ఫిర్యాదుల చేసి తన పరువు నిలుపుకోవాలని సలహా ఇస్తున్నారు.