కరీంనగర్ లో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి కోర్ట్ చౌరస్తాలోని అన్విత రెస్టారెంట్ దగ్గర అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మినిస్టర్ గంగుల కమలాకర్ తన సొంత కాన్వాయ్ లో ఎక్కించి హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పేరు. పంజాల వేణుగోపాల్ వేములవాడ పంచాయితీ రాజ్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఈయన స్వగ్రామం సిరిసిల్ల. ప్రస్తుతం కరీంనగర్ లోని గోదాంగడ్డ జెడ్ పి క్వాటర్స్ లో ఉంటున్నాడు.