టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు కొత్త పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన… తెలంగాణలో కొత్త పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగిందని నిలదీస్తున్నారని… ఇక్కడికొచ్చి మొసలికన్నీరు కారుస్తున్నారంటూ పరోక్షంగా వైఎస్ షర్మిల పార్టీపై స్పందించారు. అసలు వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా…? ఏపీలో కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిసి ఏడాదికి 12,500రూపాయలు ఇస్తున్నారని, కానీ తెలంగాణలో మాత్రం కేంద్రంతో సంబంధం లేకుండా ఏటా ఎకరానికి 10వేల రూపాయలు ఇస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో అర్ధరాత్రి దొంగ కరెంటు ఇచ్చేవారని… పెండింగ్ విద్యుత్ బిల్లులను సైతం చెల్లించలేదని ఆరోపించారు. ఇప్పుడు రైతు బంధు కూడా తెలంగాణలో ఇస్తున్నామంటూ జగన్ పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది…? ప‌్రజలు ఇబ్బందులు కనపడటం లేదా…? తెలంగాణలో రాజన్న రాజ్యమే తన లక్ష్యం అంటూ వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుపై పరోక్షంగా హింట్ ఇచ్చారు.