నోట్ల రద్దుపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ ఓ విఫల ప్రయోగమని ఆయన అన్నారు. నోట్ల రద్దు లక్ష్యం నేరవేరలేదన్నారు.
నోట్ల రద్దు అట్టర్ ప్లాప్ ప్రోగ్రామ్ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పకనే చెప్పారని ఆయన తెలిపారు. డీమానిటైజేషన్‌తో పెద్దనోట్ల చెలామణి తగ్గలేదని చెప్పారు.
నోట్ల రద్దు తర్వాత మాదక ద్రవ్యాల వాడకం, ఉగ్రవాదం భారీగా పోయిందని ఆయన ఆరోపించారు. నోట్ల రద్దు విషయంలో ప్రజల్లో భ్రమలు కల్పించారని ఆయన చెప్పారు.
అసలు పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరలేదని వెల్లడించారు. అందుకే ఈ విషయంపై బీజేపీ నేతలు పెదవి విప్పడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ చెప్పేదొకటి చేసేది మరోకటి వుంటుందన్నారు.
అప్పులు తేవడం, తప్పులు చేయడమే బీజేపీ విధానమని ఆయన మండిపడ్డారు. కేంద్రలోని బీజేపీ సర్కార్ నెలకు లక్ష కోట్ల అప్పులు చేస్తోందని ఆయన ఆరోపించారు. జన్ధన్ ఖాతాలంటూ ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు.