ఇటీవల తెలంగాణ లో బూస్టర్ డోస్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు డోసులు వేసుకుని 9 నెలలు పూర్తయిన వారికి ఈ బూస్టర్ డోస్ ను ఇస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వారు 8.3 లక్షల మంది ఉన్నట్లు సర్కారు అంచనా వేసింది.
కాగా తాజాగా కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు.రెండో డోసు, బూస్టరు డోస్ మధ్య గడువు తగ్గించాలని లేఖలో హరీశ్రావు పేర్కొన్నారు.గడువును 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని హరీశ్రావు పేర్కొన్నారు.
Advertisements
హెల్త్ కేర్ వర్కర్లకు డోసు డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించాలని కోరారు. 18 ఏళ్లు దాటిన అందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వాలని కోరారు హరీష్ రావు.