మంత్రి హరీష్ రావు వ్యూహాలు ఫలించే వరకు ఎవరికీ అర్థం కావు….పక్కా వ్యూహంతో ప్రత్యర్ధులకు దొరకకుండా హరీష్ రావు ఎత్తులు వేస్తున్నారు. త్వరలో సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు రానున్న తరుణంలో హరీష్ కీలక ఎత్తుగడలు వేశారు.
సిద్దిపేట అంటే టీఆరెస్, టీఆరెస్ అంటే సిద్దిపేట అనేది నిజమే అయినా…. సిద్దిపేట మున్సిపాలిటీలో మాత్రం రాజకీయం బిన్నంగా ఉంటుంది. అక్కడ ఏకగ్రీవాలు పోను మిగితా వార్డుల్లో టీఆరెస్ కు చాలా సార్లు చుక్కెదురైంది. బీజేపీ, ఇతర పార్టీలు గత మున్సిపల్ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లు సాధించాయి. దింతో మంత్రి హరీష్ రావు నైతికంగా ఓడినట్లే అన్న విమర్శలు వచ్చాయి. హరీష్ రావు వంటి నేతకు ఇది ఇబ్బందికర పరిణామమే. అందుకే ప్రత్యర్ధులకు ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇప్పటి నుండే తనదైన ప్లాన్ వేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సిద్దిపేటలో బీజేపీ బలం అంతా యువకులే. ఓటు కోసం యువతను మందుతోనో, డబ్బుతోనో తమ వైపుకు తిప్పుకోలేరు. పైగా వీరంతా ఒకప్పుడు టీఆరెస్ కు బలమైన ఓటు బ్యాంకు. దింతో వారిని టీఆరెస్ వైపుకు తిప్పుకొనేందుకు హరీష్ రావు క్రికెట్, వాలీ బాల్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు, హరీష్ రావు టీమ్స్ అంటూ హడావిడి చేస్తున్నారు. ఆటలను ప్రోత్సహిస్తాం అంటూ గతంలో లేనివిధంగా ఎక్కువ సమయం వారికే ఇస్తున్నారు. స్వయంగా మ్యాచులకు అటెండ్ కావటం, తను కూడా ఆడుతూ యువకులతో కలిసిపోవడం చూస్తుంటే…. మున్సిపల్ ఎన్నికలకు హరీష్ రావు ఇప్పటి నుండే స్కెచ్ వేసినట్లు ఉన్నారంటున్నారు విశ్లేషకులు.
ఆయన రాజకీయ ఎత్తులను యువత స్పోర్టివ్ గా తీసుకొని లైట్ తీసుకుంటారో…. హరీష్ గేమ్ ప్లాన్ కు పడిపోయి పట్టం కడతారో చూడాలి.