ప్రస్తుత తెలంగాణ రాజకీయంలో హరీష్‌రావు చరిష్మా, గుర్తింపు ప్రత్యేకమైనవి. అందుకే ప్రత్యర్దులు సైతం కేసీఆర్‌కు హరీష్‌రావుతో ఇబ్బందే, ఎప్పటికైనా కేసీఆర్‌ను పడగొట్టేది హరీష్‌రావే అంటూ కామెంట్స్ చేస్తుంటారు.
ఇక సిద్ధిపేటలో హరీష్‌రావుకు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, మంత్రి అయ్యాక కాస్త మారారు అన్న పేరు కూడా వచ్చింది. అయితే, హరీష్‌రావుకు ఉదయం లేచేసరికే వందల మంది ప్రజలు, కార్యకర్తలు… నేతలు హరీష్‌రావుకు ఇంటికి వస్తుంటారు. తమ కష్టాన్ని చెప్పుకోవటం, ఎవైనా పనులుంటే చేయించుకునేందుకు కలుస్తుంటారు.
అయితే, ఇటీవల సిద్దిపేట నుండి వచ్చిన ప్రజలతో… నేను వారానికి నాలుగు రోజులు సిద్దిపేటలోనే ఉంటా. మీరు ఇంత దూరం ఇబ్బందిపడుతూ రావటం ఎందుకు, అక్కడే కలవండి… అయ్యే పని అయితే ఖచ్చితంగా చేస్తా అని చెప్పారు. మీరొచ్చే పనుల్లో 90పైసలు కానివే. దీంతో మీ పని ఖరాబు… రానుపోను ఖర్చులు వేస్ట్ అంటూ చెప్పేశారు. పైగా మీకు బాధ అనిపిస్తది… అని వివరించారు. ఇప్పుడీ వీడియోను హరీష్‌రావు ఫాన్స్ సోషల్‌మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.
కానీ ఇందులో పబ్లిసిటీ స్టంట్ ఉందన్న వారు లేకపోలేదు. హరీష్ రావును దగ్గర నుండి చూశాం. ఇలాంటి చిన్న చిన్న జిమ్మిక్కులతో ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తాడు. కావాలనే వీడియో తీయించి, సోషల్‌మీడియాలో వదిలారని అభిప్రాయపడుతున్నారు.