తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోమవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఉంటుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ను తయారు చేసినట్లు చెప్పారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు జొడేద్దుల్లగా సమపాళ్లలో బడ్జెట్ ఉండబోతోందని వెల్లడించారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కేసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు వివరించారు.
కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా రాకపోయినా అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోందన్నారు. తెలంగాణ మోడల్ను దేశం అవలంబిస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందని చెప్పారు.
బడ్జెట్కు కేబినేట్ ఆమోదంతో పాటు గవర్నర్ ఆమోదం కూడా లభించిందన్నారు. శాసనసభలో తాను..శాసన మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు బడ్జెట్ 2023-24 బడ్జెట్ ను ప్రవేశపెడతామన్నారు.