తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభకు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ముందు రోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో.. ఇన్నాళ్లు ఆయన హోంఐసోలేషన్‌లో ఉండిపోయారు.తాజాగా నిర్వహించి పరీక్షలో ఆయనకు నెగెటివ్ అని తేలింది. దీంతో ఆయన సమావేశాలకు హాజరయ్యారు.
సభకు హాజరైన సందర్భంగా మంత్రి హరీష్‌రావుకు స్పీకర్ పోచారం శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రతి సభ్యుడు కరోనా నిబంధనలకు పాటించాలని పోచారం కోరారు. లక్షణాలు కనిపిస్తే ఎమ్మెల్యేలు వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేందరూ కరోనా టెస్టులు చేయించుకున్నందుకు స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు.