తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కరోనా నుండి కోలుకున్నారు. శనివారం చేసుకున్న కరోనా టెస్టుల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. దీంతో ఆయన సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనపడుతుంది.
తెలంగాణ అసెంబ్లీ సెప్టెంబర్ 7నుండి మొదలవుతున్నందున అందరూ పరీక్షలు చేయించుకోవాలన్న స్పీకర్ సూచన మేరకు మంత్రి హరీష్ రావు టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకున్నా టెస్టుల్లో పాజిటివ్ రావటంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకున్నారు. ఆయన్ను కలిసిన వారంతా పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
కేవలం ఐదు రోజుల్లోనే ఆయన కరోనా నుండి కోలుకున్నారు.