హరీష్ రావు, తెలంగాణ మంత్రి
గాంధీజీని కొంతమంది తమ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఆయన లేకపోతే స్వేచ్ఛా వాయువులు పీల్చే వాళ్ళమా? దేశ స్వాతంత్రం కోసం తుదిదాకా పోరాడిన మహోన్నత వ్యక్తి గాంధీజీ. ఇటీవల కొందరు ఆయన్ను కించ పరుస్తున్నారు. నేడు ప్రపంచమే గాంధీని ఆదర్శంగా తీసుకుంటోంది. ఎన్నో పోరాటాలు చేసి, ప్రజలను ఒక్క తాటిపైకి తెచ్చిన వ్యక్తి గాంధీ.
టీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో తాగు, సాగు నీటికి కొదువ లేకుండా చేశాం. కరెంట్ కష్టాలను కూడా లేకుండా చేశాం. హైదరాబాద్ కు కృష్ణా జలాలను తెచ్చి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. పటాన్ చెరులో 250 కోట్లతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మిస్తున్నాం. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. అది చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
ఓ వైపు తమ పని తీరుకు మెచ్చి కేంద్రం అవార్డులిస్తుంటే.. ఇంకోవైపు బీజేపీ నాయకులు విమర్శలు చేయడం అర్ధరహితం. మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిపారసు చేసినా.. కేంద్రం మాత్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. బీజేపీ నాయకులను ప్రజలు నమ్మరు. మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే. కరోనా సమయంలో అద్భుతమైన సేవలు అందించిన పోలీస్, వైద్యులు, సఫాయి కార్మికుల విగ్రహాలు ఏర్పాటు చేయడం సంతోషకరం.
తెలంగాణ ఏర్పాటుకు అడ్డం కాదు, నిలువు కాదు అన్న వాళ్ళు… ఇప్పుడు రాజకీయలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు… నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు. కేంద్ర ప్రభుత్వం చేతివృత్తులను నిర్వీర్యం చేస్తోంది. అమ్మటమే తప్ప, అభివృద్ధి చేయడం తెలిడం లేదు.