ఎమ్మెల్సీ కవిత ఒక మహిళా అని కూడా చూడకుండా ఈడీ అధికారులు వేధించడం సిగ్గుచేటని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ..బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రధాన మంత్రి పైన ఎదురు దాడి చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. రాష్ట్రం పైన కేంద్ర పక్షపాత ధోరణి అవలంబిస్తుందన్నారు.
బీజేపీ పార్టీలో ఒక్కరి పైన కూడా ఈడీ, సీబీఐ విచారణ లేదున్నారు. మల్లారెడ్డి, కమలాకర్ పై ఈడీ సీబీఐ వేధింపులకు పాల్పడిందని మండిపడ్డారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పైన రేవంత్ రెడ్డి ఆధారాలు చూపి మాట్లాడాలన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో 100 సీట్లలో బీఆర్ ఎస్ పార్టీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ కోసం కిషన్ రెడ్డి రాజీనామా చేయమంటే పారిపోయాడని ఎద్దేవా చేశారు. స్వతంత్ర ఉద్యమంలో బీజేపీ ఎక్కడ ఉంది. అని ప్రశ్నించారు.
బీజేపీ అదాని పైప ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అదానీ పై జేపీసీ వేయాలని, బీజేపీ భారత రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.