బూర నర్సయ్య గౌడ్ పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో అపాయింట్ మెంట్ కోసం రెండు రోజులు బూర నర్సయ్య గౌడ్ పడిగాపులు గాసినా తరుణ్ చుగ్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆయన అన్నారు.
బూర నర్సయ్య గౌడ్ ఉన్నత విద్యావంతుడని గౌరవించి, సీఎం కేసీఆర్ రెండు సార్లు ఎంపీ టికెట్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అలాంటి సీఎం కేసీఆర్ పై బూర నర్సయ్య విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.
ఈ మేరకు బూరనర్సయ్య తీరును తప్పుబడుతూ మంత్రి ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బూర నర్సయ్య గౌడ్ నిన్న ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ కీలక పాత్ర పోషించారు.
2013లో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 2014 భువనగిరి నుంచి ఎంపీగా పోటి చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు.