ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికమని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై మాత్రమే కేంద్ర నిఘా సంస్థలు పని చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు దేశంలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఆ పార్టీ అరాచకాలు ఇలానే కొనసాగితే దేశ ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అణచివేతలు, జైళ్లను నింపడం ద్వారా ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని చరిత్ర చెబుతుందని వెల్లడించారు. కమలం పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో నే ఉన్నాయని పేర్కొన్నారు.
అంతకుముందు సూర్యాపేట మండలం రామచంద్రాపురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.