రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి యాదాద్రి ఆలయం వద్ద నూతన బస్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మేల్యే సునీత మహేందర్ రెడ్డి,ఆర్టీసి చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. యాదాద్రి లో భక్తులకు అన్ని సౌకర్యాలతో సుమారు ఏడు కోట్ల రూపాయలతో నూతన బస్ స్టాండ్ ని నిర్మించినట్లు తెలిపారు.
అన్ని ప్రాంతాల భక్తులకు సౌకర్యంగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యాదాద్రి ని ముఖ్య మంత్రి కేసీఆర్ అభివృద్ధి చేశారు. యాదాద్రి కి భక్తులు రోజుకు 20 వేల మంది, వారాంతంలో 35 వేల మంది భక్తులు వస్తున్నారు.
రానున్న కాలంలో రోజుకు లక్ష మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ పాలనను, కేంద్ర ప్రభుత్వ పాలనను దేశ ప్రజలు బేరిజ్ చేసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ పనితనం గుర్తించారు కాబట్టే ప్రజలంతా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కొనియాడారు. యాదగిరిగుట్ల ఆలయానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన కేసీఆర్.. చరిత్రలో నిలిచారని మంత్రి తెలిపారు.