ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వనదుర్గ అమ్మవారిని వేడుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ లోని వనదుర్గ ఆలయంలో నిర్వహించే పూజలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కంటోన్మెంట్ బీజేపీ నేతల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని సూచించారు మంత్రి.