జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొడాలి నాని అడ్డా అయిన గుడివాడలో సోమవారం నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నాని ఎవరో నాకు తెలియదు అంటూ ఓ రేంజ్ లో ఆడుకున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే విషయమై కొడాలి నాని కూడా స్పందించారు.
సినిమాలు మానేశానని చెప్పింది ఆయనే. జగన్ పాలన బాగా చేస్తే సినిమాలు చేసుకుంటానని చెప్పింది ఆయనే..ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ను యాక్టర్ గానే చూస్తున్నామని అన్నారు. ఓవైపు చంద్రబాబు నాయుడు దత్త పుత్రుడిని, మరోవైపు సొంత పుత్రుడిని బయటకు పంపుతున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీ పెట్టి వ్యాపారం చేస్తున్న ఒక ఆదర్శపురుషుడు పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. ఆయన వకీల్ సాబ్ అనుకుంటున్నారు.. కానీ జనాలు షకీలా సాబ్ అనుకుంటున్నారని విమర్శలు చేశారు.